తమన్నా బేబీ స్టెప్స్..

తమన్నా బేబీ స్టెప్స్..

ఇటీవల హైదరాబాద్‌లో వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొన్న మిల్కీ బ్యూటీ తమన్నకు కరోనా సోకింది. పాజిటివ్ అని తెలిసిన వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న ఆమె మళ్లీ ఫిట్ నెస్ వైపు దృష్టి పెట్టారు. బ్యాక్ టు ఫిజికల్ ఫిట్ నెస్ అంటూ ఉత్సాహంగా.. ఎక్సర్ సైజ్ చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమన్నా బేబీ స్టెప్స్ అంటూ.. నెమ్మదిగా యాక్షన్లోకి దిగి పోయారు. వార్మప్ ఎక్సర్ సైజ్‌లతో స్టామినా పుంజుకునేందుకు తేలికపాటి వ్యాయామం మాత్రమే చేస్తున్నానని తమన్నా చెప్పుకొచ్చారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత వ్యాయామం తప్పనిసరి అని ఆమె ఈ వీడియోలో పేర్కొన్నారు.

కాగా తమన్న బాలీవుడ్‌లో నవాజుద్దీన్ సిద్దిఖీ, కబీర్ దుహాన్ సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న బాలీవుడ్ చిత్రం బోలే చుడియన్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి నవాజుద్దీన్ సోదరుడు షమాస్ నవాబ్ సిద్ధిఖీ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో సీటిమార్, దటీజ్ మహాలక్ష్మి చిత్రాల్లో నటిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story