Vidyullekha Raman: బొద్దుగా ఉండే విద్యుల్లేఖ .. స్లిమ్‌గా స్వీట్‌గా..
మీ మనసుకి అనిపించాలి.. అప్పుడు అది కచ్చితంగా సాధ్యం అవుతుంది. అలా అనుకున్నప్పుడు ఎంతైనా కష్టపడతారు. బొద్దుగా ఉన్నా ఆఫర్లు వస్తున్నాయి. కొన్ని అవమానాలు కూడా భరించాను. కానీ ఇది కాదు నేను కోరుకుంది. జీవితాంతం ఇలా ఉండాలనుకోలేదు. మార్పు కావాలనుకున్నాను. ప్రయత్నించాను.. సాధించాను. మీరు కూడా ప్రయత్నిస్తే తప్పక సక్సెస్ అవుతారు. దానికి డెడికేషన్ చాలా ముఖ్యం అంటూ అభిమానులకు స్పూర్తిదాయక వాఖ్యలను వినిపించారు నటి విద్యుల్లేఖ రామన్. లేటెస్ట్‌గా మరికొన్ని పిక్స్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
జీవా, సమంత జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'నీతనే ఎన్ పొన్వసంతం' చిత్రంతో అరంగేట్రం చేసిన నటి విద్యుల్లేఖ రామన్ గత ఏడాది లాక్‌డౌన్ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకుంది. ప్రముఖ సినీ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్య బరువు బాగా తగ్గింది.
జీవనశైలి మరియు అలవాట్లను మార్చుకున్నాను. "మనసులో గట్టిగా అనుకుంటే ఏదైనా సాధ్యమేనని నేను గ్రహించాను. క్రమశిక్షణతో ఉండాలి, వారానికి 6 సార్లు వ్యాయామం చేయాలి, సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఫలితాన్ని పొందడానికి రహస్య మందులు లేవు. కేవలం కృషి మాత్రమే ఉంటుంది. జీవితంలో ఏదీ తేలికగా రాదు. కానీ మీరు ఫలితాన్ని చూసినప్పుడు, అది విలువైనదిగా కనిపిస్తుంది అని చెబుతోంది విద్యుల్లేఖ రామన్. తమిళ నటి అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com