Taraka Ratna: పవన్ కళ్యాణ్‌ను బాబాయ్ అని పిలుస్తుంటాను: నందమూరి హీరో

Taraka Ratna: నందమూరి హీరోల్లో బాలకృష్ణ, ఎన్‌టీఆర్.. తిరుగులేని నటులుగా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు. కళ్యాణ్ రామ్ కూడా హిట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కానీ హీరోగా పరిచయమయ్యి పలు చిత్రాల్లో నటించి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వల్ల ఫేడవుట్ అయ్యాడు తారకరత్న. ఇటీవల ఈ హీరో పేరు కూడా ఇండస్ట్రీలో బాగానే వినిపిస్తోంది. ఇటీవల తారకరత్న.. పవన్ కళ్యాణ్‌పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హీరోగా ఎన్ని సినిమాలు చేసినా వర్కవుట్ అవ్వకపోయేసరికి విలన్‌గా కూడా మారాడు తారకరత్న. చాలానే సినిమాల్లో విలన్‌గా భయపెట్టినా కూడా తారకరత్నకు హిట్ మాత్రం రాలేదు. అయితే చాలాకాలం తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో తారకరత్న విలన్ అని వార్తలు వచ్చినా అవి కూడా నిజం కాదని తేలిపోయింది. తారకరత్న నటించిన 9 హవర్స్ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో తారకరత్న పవన్ కళ్యాణ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తాను పవన్ కళ్యాణ్‌ను బాబాయ్ అని పిలుస్తానని తారకరత్న చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఏదైనా చేయాలని అనుకునే వ్యక్తి అని ప్రశంసించారు. ఇక టీడీపీ, జనసేన పొత్తు గురించి మాట్లాడుతూ అదంతా మావయ్య చంద్రబాబు చూసుకుంటారని సమాధానాన్ని దాటేశారు. ఇక తనకు కూడా రాజకీయాలంటే ఇష్టమని, త్వరలోనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటానని పొలిటికల్ ఎంట్రీ గురించి స్పష్టం చేశాడు తారకరత్న.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com