ముక్కు అవినాష్‌కు తెలంగాణ ప్రభుత్వం సాయం..!

ముక్కు అవినాష్‌కు తెలంగాణ ప్రభుత్వం సాయం..!
ఆమె వైద్యానికి అవసరమయ్యే ఖర్చును తెలంగాణ ప్రభుత్వం చెక్కు రూపంలో సహాయం అందించింది.

జబర్దస్త్‌ కమెడియన్‌ ముక్కు అవినాష్‌ కి తల్లి కాళ్ళ లక్ష్మిరాజం అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమె వైద్యానికి అవసరమయ్యే ఖర్చును తెలంగాణ ప్రభుత్వం చెక్కు రూపంలో సహాయం అందించింది. వివరాల్లోకి వెళ్తే.. అవినాష్ తల్లి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమె చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 60 వేల రూపాయలు మంజూరయ్యాయి. ఈ చెక్కును శనివారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అవినాష్‌కు అందజేశారు. ఈ ఫొటోను అవినాష్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కాగా జబర్దస్త్‌ షో ద్వారా మంచి కమెడియన్‌ గా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్‌.. బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story