ప్రముఖ జర్నలిస్ట్, నటుడు TNR కన్నుమూత..!

ప్రముఖ జర్నలిస్ట్, నటుడు TNR కన్నుమూత..!
X
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారికి చాలా మంది జర్నలిస్టులు బలైపోతున్నారు. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్, నటుడు తుమ్మల నరసింహారావు(TNR) కన్నుమూశారు.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారికి చాలా మంది జర్నలిస్టులు బలైపోతున్నారు. తాజాగా ప్రముఖ జర్నలిస్ట్, నటుడు తుమ్మల నరసింహారెడ్డి(TNR) కన్నుమూశారు. Frankly With TNR షోతో యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన.. పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. దర్శకుడు అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన ఆయన... రచయితగా, నటుడుగా మారారు. జర్నలిస్ట్ గా పలు ఛానల్లో పనిచేశారు. చిరంజీవికి పెద్ద అభిమాని ఆయన... అయితే గత కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన టీఎన్ఆర్.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు.

Tags

Next Story