'సినిమా చూశాక మాట్లాడుకుందాం'... రామజోగయ్య శాస్త్రి కౌంటర్..!

సినిమా చూశాక మాట్లాడుకుందాం... రామజోగయ్య శాస్త్రి కౌంటర్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా వకీల్‌‌సాబ్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా వకీల్‌‌సాబ్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి 'సత్యమేవ జయతే' సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్... ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రీ ఈ సాంగ్ రాయగా.. శంకర్‌ మహాదేవన్‌తో కలిసి పృథ్వీచంద్ర, థమన్‌ ఈ పాటను ఆలపించారు. రిలీజ్ అయిన కొద్దిసేపటి క్రితమే ఈ పాట బాగా పాపులర్ అయింది.

ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ కి నిజ జీవితానికి దగ్గరగానే ఉందని చెప్పాలి. అయితే ఈ సినిమా పైన సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యయి. ముఖ్యంగా పాట రాసిన రామజోగయ్య శాస్త్రిపై జోక్‌లు వేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. 'వకీల్ సాబ్ గురించి పాట రాయమంటే.. పవన్ కళ్యాణ్ గురించి పాట రాశారేంటి? అంటూ మీమ్స్ వదులుతున్నారు.

అయితే దీనిపైన రచయిత రామజోగయ్య శాస్త్రీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'సినిమా చూశాక మాట్లాడుకుందాం.. సరేనా'? అంటూ రియాక్ట్ అయ్యారు. ఇదిలాఉంటే.. 'వ‌కీల్‌సాబ్‌' చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


Tags

Read MoreRead Less
Next Story