Uppena Movie : వెండితెర పైనే కాదు .. బుల్లితెర పైన కూడా సూపర్ డూపర్ హిట్టే..!

Uppena Movie : వెండితెర పైనే కాదు .. బుల్లితెర పైన కూడా సూపర్ డూపర్ హిట్టే..!
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు.

ధియేటర్లు పునప్రారంభం తర్వాత తెలుగు సినిమాల్లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌​బస్టర్‌ హిట్‌గా నిలిచిన సినిమాలలో ఉప్పెన మూవీ ఒకటి. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల పరంగా కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

కేవలం వెండితెర పైన బుల్లితెర పైన కూడా ఉప్పెన మూవీ తన హవాను కొనసాగిస్తుంది. తాజాగా ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమయ్యింది. ఈ సినిమాకి ఏకంగా 18.5 టీఆర్పీ రేటింగ్‌ దక్కింది. ఓ డెబ్యూ మూవీ హీరో సినిమాకి ఇంతలా రేటింగ్ రావడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఈమధ్య కాలంలో అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో', మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాల తర్వాత ఎక్కువ రేటింగ్ పొందిన చిత్రంగా ఉప్పెన నిలిచింది.

Tags

Next Story