టాలీవుడ్

Thank You Teaser: లైఫ్‌లో ఇంక కాంప్రమైజ్ అవ్వను.. ఎన్నో వదులుకున్నాను: నాగచైతన్య

Thank You Teaser: 'నా సక్సెస్‌కు నేను కారణం' అని నాగచైతన్య వాయిస్‌తో మొదలయిన టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ముందుకెళ్తుంది.

Thank You Teaser: లైఫ్‌లో ఇంక కాంప్రమైజ్ అవ్వను.. ఎన్నో వదులుకున్నాను: నాగచైతన్య
X

Thank You Teaser: అక్కినేని హీరోలు సినిమాలు చేయడంలో స్పీడ్ తగ్గించినా.. ప్రయోగాల వైపు మాత్రం అడుగులేస్తున్నారు. తన నటనతో, తనకు సూట్ అయ్యే స్క్రిప్ట్ సెలక్షన్‌తో ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటున్నాడు నాగచైతన్య. ఒకవైపు ప్రేమకథల్లో నటిస్తూనే మరోవైపు కాస్త డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటున్నాడు. అలాంటి ఓ డిఫరెంట్ కథతో తెరకెక్కిన చిత్రమే 'థాంక్యూ'.

విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో నాగచైతన్య నటిస్తున్న చిత్రమే థాంక్యూ. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా అవికా గోర్, మాళవిక నాయర్, రాశి ఖన్నా నటిస్తున్నారు. థాంక్యూ సినిమా షూటింగ్ సమయంలో కూడా పెద్దగా అప్డేట్స్ బయటికి రాకపోవడంతో మూవీ ఎలా ఉంటుందో అని ప్రేక్షకుల్లో అనుమానం మొదలయ్యింది. కానీ తాజాగా విడుదలయిన టీజర్ చూస్తుంటే మూవీ ప్రామిసింగ్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది.

'నా సక్సెస్‌కు నేను కారణం' అని నాగచైతన్య వాయిస్‌తో మొదలయిన టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ముందుకెళ్తుంది. తనను సెల్ఫిష్ అనే ప్రపంచానికి దూరంగా తానెంటో తెలుసుకోవడానికి నాగచైతన్య ప్రయాణం మొదలవుతుంది. 'లైఫ్‌లో ఇంకా కాంప్రమైజ్ అవ్వను.. ఎన్నో వదులుకొని ఇక్కడ వరకు వచ్చాను' అని హీరో చెప్పే డైలాగ్ తనకు పర్సనల్‌గా కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఫైనల్‌గా థాంక్యూ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES