Thank You Trailer: 'థాంక్యూ' ట్రైలర్ రిలీజ్.. ప్రేమ గురించి గొప్పగా చెప్పిన చైతూ..

Thank You Trailer: ఇప్పటివరకు ఎన్నో యూత్ సినిమాలతో ఆకట్టుకున్నాడు అక్కినేని నాగచైతన్య. తను మాస్ ఎలిమెంట్స్‌తో చేసిన కమర్షియల్ సినిమాలకంటే.. సింపుల్‌గా ఉన్న లవ్ స్టోరీలు, ఫ్యామిలీ సినిమాలే తనకు ఎక్కువగా సక్సెస్‌ను తెచ్చిపెట్టాయి. తాజాగా అలాంటి మరో సింపుల్, హార్ట్ టచింగ్ స్టోరీతో చైతూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే 'థాంక్యూ'. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ విడుదలయ్యింది.
మనం సినిమాతో అక్కినేని ఫ్యామిలీకి దగ్గరయ్యాడు దర్శకుడు విక్రమ్ కె కుమార్. ఇప్పటికే అఖిల్‌తో మనం సినిమా చేసినా అది అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు నాగచైతన్యతో చేస్తున్న థాంక్యూతో ఎలాగైనా హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన సాంగ్స్, టీజర్ చూస్తుంటే ఇందులో మూడు అందమైన ప్రేమకథలతో పాటు ఓ సోషల్ మెసేజ్ కూడా ఉందని అర్థమవుతుంది. తాజాగా విడుదలయిన ట్రైలర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
ట్రైలర్‌లో నాగచైతన్య ఆలోచింపజేసే డైలాగ్స్ బాగున్నాయి. అందులోనూ ముఖ్యంగా 'మనిషిని పట్టుకొని వేలాడే ప్రేమ కంటే, స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ గొప్పది' అంటూ ప్రేమ గురించి బాగా చెప్పాడు చైతూ. ఇక హీరోయిన్లుగా నటించిన అవికా గోర్, మాళవికా నాయర్, రాశి ఖన్నాకు కూడా సినిమాలో ప్రాముఖ్యత ఉందని స్పష్టమవుతోంది. 'ఇట్స్ ఏ లాంగ్ జర్నీ మై డియర్ ఫ్రెండ్' అన్న డైలాగుతో ట్రైలర్ ముగుస్తుంది. ఇక థాంక్యూ చిత్రం జులై 22న విడుదలకు సిద్ధమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com