God Father : 'తార్ మార్ తక్కర్ మార్' సాంగ్ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది..

God Father : తార్ మార్ తక్కర్ మార్ సాంగ్ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది..
X
God Father : టాలీవుడ్ మెగాస్టార్, బాలీవుడ్ మెగాస్టార్ కలిసి డ్యాన్స్ చేసిన ‘తార్ మార్ తక్కర్ మార్’ సాంగ్ పై గాడ్‌ఫాదర్ మూవీ యూనిట్ శుభవార్త చెప్పింది

God Father : టాలీవుడ్ మెగాస్టార్, బాలీవుడ్ మెగాస్టార్ కలిసి డ్యాన్స్ చేసిన 'తార్ మార్ తక్కర్ మార్' సాంగ్ పై గాడ్‌ఫాదర్ మూవీ యూనిట్ శుభవార్త చెప్పింది. తార్ మార్ తక్కర్ మార్ లిరికల్ సాంగ్‌ను గత వారమే రిలీజ్ చేయాలనుకున్నారట. అయితే సాంకేతిక సమస్య కారణంగా అది కుదరలేదని మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 20వ తేదీన లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించించారు చిత్ర యూనిట్.

మళయాలంలో మోహన్‌లాల్ హీరోగా రిలీజ్ అయిన లూసిఫర్‌కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు మోహన్‌రాజా. చిరుతో పాటు సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. తమన్ మ్యూజిక్‌ను అందించారు. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

Tags

Next Story