టాలీవుడ్

Tharun Bhascker: వెయిటింగ్ ముగిసింది.. తరుణ్ భాస్కర్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది..

Tharun Bhascker: గ్యాప్‌లో నటుడిగా కూడా మారాడు తరుణ్ భాస్కర్. దీంతో డైరెక్టర్ మానేశారంటూ తనపై విమర్శలు కూడా వచ్చాయి.

Tharun Bhascker: వెయిటింగ్ ముగిసింది.. తరుణ్ భాస్కర్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది..
X

Tharun Bhascker: ఈరోజుల్లో ప్రేక్షకులు రొటీన్ కమర్షియల్ సినిమాలకంటే డిఫరెంట్‌గా ఉండే కథలనే ఇష్టపడుతున్నారు. అంతే కాకుండా కథ డిఫరెంట్‌గా ఉండి.. దానిని కాస్త ఎంటర్‌టైనింగ్‌గా చెప్తే ఇంక సినిమా సూపర్ హిట్టే. అలాంటి సినిమాలు తెరకెక్కించే దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. అందులో ఒకరు తరుణ్ భాస్కర్. ఇక తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణ్ భాస్కర్ తరువాతి చిత్రం గురించి అప్డేట్ తాజాగా బయటికొచ్చింది.

'పెళ్లిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది'.. ఈ రెండు యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాలు. ముఖ్యంగా ఈ నగరానికి ఏమైంది అనేది చాలామంది ఫేవరెట్. ఈ నగరానికి ఏమైంది సినిమా విడులదయ్యి నాలుగేళ్లు అయ్యింది. ఆ సినిమాకు సీక్వెల్‌ కూడా ఉందని తరుణ్ భాస్కర్ అనౌన్స్ చేసిన కూడా చాలాకాలమే అయ్యింది. అయినా కూడా ఇంకా ఏ అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త అసహనంగా ఉన్నారు.

ఈ గ్యాప్‌లో నటుడిగా కూడా మారాడు తరుణ్ భాస్కర్. దీంతో డైరెక్టర్ మానేశారంటూ తనపై విమర్శలు కూడా వచ్చాయి. ఇంతలోనే తన తరువాతి సినిమా పోస్టర్‌ను సైలెంట్‌గా రిలీజ్ చేశాడు తరుణ్ భాస్కర్. 'కీడా కోలా' అనే పేరుతో ఓ క్రైమ్ కామెడీ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు ఈ దర్శకుడు. 2023లో ఈ సినిమా విడుదల కానుందని కూడా అనౌన్స్ చేసేశాడు. కానీ దీని గురించి ఇంకేమీ వివరాలు ఇవ్వకుండా సస్పెన్స్‌లో పెట్టాడు తరుణ్ భాస్కర్.Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES