F3 Movie: 'ఎఫ్ 3' కోసం అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ డైరెక్టర్‌కే..!

F3 Movie: ఎఫ్ 3 కోసం అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ డైరెక్టర్‌కే..!
F3 Movie: సీనియర్ హీరో వెంకటేశ్ కూడా ఎఫ్ 3 కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం.

F3 Movie: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన 'ఎఫ్ 3'.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎఫ్ 2 లాగానే ఎఫ్ 3లో కూడా కామెడీ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమాకు కూడా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇంత భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎక్కువ రెమ్యునరేషన్ ఎవరు తీసుకున్నారు అనేది హాట్ టాపిక్‌గా నడుస్తోంది.

ఎఫ్ 3 ప్రమోషన్స్‌లో నటీనటులతో పాటు డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా చురుగ్గా పాల్గొన్నారు. అయితే షూటింగ్‌ సమయంలో చాలా గ్యాప్ రావడం, ఎక్కువమందిని సినిమాకి క్యాస్ట్ చేసుకోవడం వల్ల ఎఫ్ 2కంటే ఎఫ్ 3కు డబుల్ బడ్జెట్ అయినట్టు నిర్మాతలు తెలిపారు. అయితే బడ్జెట్ అంత భారీగా పెరిగిందంటే అందులో నటీనటుల రెమ్యునరేషన్ కూడా భాగమే కదా అని ప్రేక్షకులు దీని గురించి ఆరాతీయడం మొదలుపెట్టారు.

సీనియర్ హీరో వెంకటేశ్ కూడా ఎఫ్ 3 కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. వెంకటేశ్, వరుణ్ తేజ్‌లు రూ.5 నుండి 7 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక హీరోయిన్లుగా చేసిన తమన్నా రూ.2 కోట్లు, మెహ్రీన్ రూ.కోటి రెమ్యునరేషన్‌గా తీసుకున్నారట. ఇక వీరందరికంటే డైరెక్టర్ అనిల్ రావిపూడి రూ.15 నుండి 18 కోట్ల రెమ్యునరేషన్ టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్.

Tags

Read MoreRead Less
Next Story