హీరోలకి అక్కాచెల్లెళ్లుగా నటించిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!

హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ పాత్రలకి మాత్రమే కాదు ఇంపార్టెంట్ రోల్స్ కూడా.. సినిమా కథలేప్పుడు హీరోహీరోయిన్‌ల చుట్టూ తిరిగినప్పటికీ... అప్పుడప్పుడు కొన్ని సినిమాలు మాత్రం అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల చుట్టూ కూడా తిరుగుతుంటాయి. అలా టాలీవుడ్ లోని స్టార్ హీరోలకి అక్కా లేదా చెల్లెళ్లుగా నటించిన కొందరు హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..!
1.శోభన్ బాబు- శ్రీదేవి : 1979లో వచ్చిన బంగారు చెల్లెలు చిత్రంలో శోభన్ బాబు, శ్రీదేవి అన్నాచెల్లెల్లుగా కలిసి నటించారు. ఈ సినిమాలోని విరిసిన సిరిమల్లి..పెరిగే జాబిల్లి అంటూ వచ్చే ఈ పాట ఎవర్ గ్రీన్
2.చిరంజీవి - ఖుష్బూ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన స్టాలిన్ సినిమాలో ఖుష్బూ చిరంజీవికి అక్కగా నటించి మెప్పిచింది. ఈ సినిమాలో అమెది కీలకపాత్ర.
3.బాలకృష్ణ- దేవయాని : బాలకృష్ణ హీరోగా నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలకృష్ణకి చెల్లెలుగా నటించి శభాష్ అనిపించింది దేవయాని. కనిపించేది కొన్ని సన్నివేశాలే అయిన ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తుంది దేవయాని.
4. పవన్ కళ్యాణ్ - సంధ్య : పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అన్నవరం చిత్రంలో పవన్ కళ్యాణ్ కి చెల్లిగా నటించి మెప్పించింది నటి సంధ్య.
5. రాజశేఖర్ - మీరాజాస్మిన్ : అన్నాచెల్లెళ్ళ అనుబంధం చుట్టూ అల్లుకున్న చిత్రం గోరింటాకు. ఈ సినిమాలో రాజశేఖర్‌కి చెల్లెళ్ళుగా మీరాజాస్మిన్ నటించి ఆదరగోట్టింది.
6. శ్రీహరి - త్రిష : నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కింగ్ సినిమాలలో శ్రీహరికి చెల్లిగా నటించింది త్రిష.
7. ఉపేంద్ర- నిత్య మీనన్ : అల్లు అర్జున్ హీరోగా వచ్చిన s/o సత్యమూర్తి సినిమాలో వీరిద్దరూ అన్నాచెల్లెల్లుగా కలిసి నటించారు.
8. నితిన్-సింధు తులాని : ఇష్క్ సినిమాలో నితిన్ కి అక్కగా నటించింది సింధుతులాని.. ఆమెది ఈ సినిమాలో కీలకపాత్ర
9. రామ్ - అంజలి : వెంకటేష్, రామ్ హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ సినిమాలో అంజలి.. రామ్ కి అక్కగా నటించింది.
10. సుధీర్ బాబు - సమంత : నాగచైతన్య, సమంత కాంబినేషన్ లో వచ్చిన మూవీలో సుధీర్ బాబుకి సమంత చెల్లిగా నటించింది. సుధీర్ బాబుకి ఇదే మొదటి సినిమా కావడం విశేషం.
11. మంచు విష్ణు - కాజల్ అగర్వాల్ : మోసగాళ్ళు చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు.
12. అల్లరి నరేష్ - కార్తీక నాయర్ : బ్రదర్ అఫ్ బొమ్మాలి చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు.
వీరు మాత్రమే కాకుండా.. అలనాటి తారలు ఎన్టీఆర్ - సావిత్రి, ఎన్టీఆర్-వాణిశ్రీ, ANR- జయంతి, కృష్ణంరాజు- రాధిక మొదలుగు వారు కూడా అన్నాచెల్లెళ్ళుగా కలిసి నటించి మెప్పించారు.
ప్రస్తుతం చిరంజీవి- కీర్తి సురేష్ వెండితెర పై అన్నాచెల్లెళ్ళుగా కలిసి నటించబోతున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే బోలా శంకర్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com