RRR Movie: 'ఆర్ఆర్ఆర్'లో ఇదే హైలెట్.. ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఎమోషన్స్‌తో..

RRR Movie: ఆర్ఆర్ఆర్లో ఇదే హైలెట్.. ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఎమోషన్స్‌తో..
RRR Movie: కొన్ని పాత్రలు ప్రేక్షకుల మనస్సుల్లో సజీవంగా ఉంటాయి. హైప్స్ దాటి ఆలోచిస్తే మనస్సుల్లో చెరగని ముద్రను వేస్తాయి

RRR Movie: ఆర్ ఆర్ ఆర్.. గత మూడేళ్ళుగా తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు భారతీయ సినిమా ప్రేక్షకుల్ని ఊరిస్తున్న టైటిల్.. ఎంత భారీతనం, భారీ తారాగణం ఉన్నా.. కథను నడిపించేవి బలమైన ఎమోషన్సే.. వాటిని అంతే బలంగా పట్టుకోవడంలో దిట్ట అయిన రాజమౌళి మార్క్ కొమరంభీముడో పాటలో పతాక స్థాయిలో కనిపిస్తుంది. అప్పటి వరకూ కథను ఇంట్రడక్షన్స్, పాటలు, ఫైట్స్ ఇద్దరు స్టార్స్ మద్య దోస్తీలు, జగడాలు చూసి ఆనందిస్తున్న ప్రేక్షకులకి ఆ పాట సన్నివేశం దానిని చిత్రీకరించిన తీరు మాత్రం హృదయాల్లోకి చొచ్చుకెళుతుంది.

కొన్ని పాత్రలు ప్రేక్షకుల మనస్సుల్లో సజీవంగా ఉంటాయి.. ఆ హైప్స్ , హైలెట్స్ దాటి ఆలోచిస్తే మనస్సుల్లో చెరగని ముద్రను వేస్తాయి. అలాంటి సందర్భాన్ని అత్యంత ప్రతిభావంతగా వాడుకున్నడు జక్కన్న. ఇద్దరి మనస్సులో రగులుతన్న ఎమోషన్స్ ని ప్రేక్షకులు గుండెల్ని పిండేలా చేసిన తారక్, రాంచరణ్ నటనకు ఈ సన్నివేశం పతాక స్థాయిలో నిలబెట్టింది.

హైలెట్స్ మాట్లాడుకోవాల్సి వస్తే ఈ సన్నివేశం నుండే మొదలు పెట్టాలి. రక్తం ధారలు కడుతున్నా, వళ్ళు ని దున్నుతున్నా తారక్ కళ్ళలో కనిపించే ఆ గర్వం జాతీయ పతాకంలా రెపరెపలాడింది. గుండెల్లో బాధను, కళ్ళల్లో కన్నీరుని అదముకొని చరణ్ చేసిన నటన అతని కెరీర్‌లో గుర్తుంచుకునే సన్నివేశాల్లో తప్పకుండా నిలబడుతుంది. ఇద్దరు సమవుజ్జీలు నటనలో తలపడటం ప్రేక్షకులకు మరపురాని సన్నివేశంగా మిగిలిపోతుంది. ఇలాంటి పాత్రలలో ఇద్దరు ఒకరినొకరు పోటీలు పడ్డారు.. ఆ సన్నివేశాన్ని అంతే స్థాయిలో నిలబెట్టారు..

Tags

Next Story