RC 15: ఆర్‌సీ 15 టైటిల్ ఫిక్స్.. 'అధికారి' కాదట..!

RC 15: ఆర్‌సీ 15 టైటిల్ ఫిక్స్.. అధికారి కాదట..!
RC 15: ఆర్ఆర్ఆర్ ఒక్కటి రామ్ చరణ్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు తాను కూడా పాన్ ఇండియా హీరో అయిపోయాడు.

RC 15: పాన్ ఇండియా సినిమాలు అనేవి పాపులర్ అయిన తర్వాత భాషతో సంబంధం లేకుండా దర్శకులు, హీరోలు కలిసి పనిచేస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలతో హిట్లు కొట్టిన దర్శకులంతా తెలుగు సినిమా హీరోలే కావాలని క్యూ కడుతున్నారు. అలా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్.. రామ్ చరణ్‌తో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్ట్ రూమర్ బయటికొచ్చింది.

'ఆర్ఆర్ఆర్'కు ముందు రామ్ చరణ్ ఏ పాన్ ఇండియా చిత్రంలోనూ నటించలేదు. కానీ ఆర్ఆర్ఆర్ ఒక్కటి రామ్ చరణ్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు తాను కూడా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. అందుకే తమిళ స్టార్ డైరెక్టర్ ఏరికోరి తనతో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంతలోనే ఈ మూవీ టైటిల్ ఇదేనంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

డైరెక్టర్ శంకర్ చేసే ప్రతీ సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. అయితే రామ్ చరణ్‌తో చేసే సినిమాలో కూడా అలాగే ఉంటుందని, అందుకోసమే ఈ సినిమాకు 'అధికారి' అనే టైటిల్ పెట్టాలని మూవీ టీమ్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు టైటిల్ అది కాదని, 'సిటిజెన్' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ కనిపించనుంది.

Tags

Read MoreRead Less
Next Story