Mahashivaratri 2021: వెండితెరపై మహాశివుడిగా నటించి.. మెప్పించిన హీరోలు వీళ్ళే..!

దక్షయజ్ఞం, ఉమా చండీ గౌరీ శంకరుల కథ సినిమాల్లో శివుడి వేషంలో మెప్పించారు ఎన్టీఆర్..!
మూగమనసులు సినిమాలోని గౌరమ్మ నీ మొగుడెవరమ్మ పాటలో శివుడిగా కనిపించి మెప్పించారు ఏఎన్నార్!
పరమానందయ్య శిష్యుల కథ సినిమాలో శివుడి పాత్రలో నటించి మెప్పించారు నట భూషణ శోభన్ బాబు
సీనియర్ నటుడు బాలయ్య చాలా సినిమాల్లో శివుడిగా నటించి మెప్పించారు...జగన్మాత,భక్త కన్నప్ప తదితర చిత్రాల్లో శివుడిగా నటించారు.
వినాయక విజయం సినిమాలో కృష్ణంరాజు శివుడిగా మెప్పించారు.
శ్రీ మంజునాథ చిత్రంలో శివుడి వేషంలో నటించి మెప్పించారు మెగాస్టార్ చిరంజీవి.. అంతకుముందు ఆపద్భాందవుడు, పార్వతి పరమేశ్వరులు చిత్రాలలో కాసేపు కనిపించారు.
సీతా రామకళ్యాణం సినిమాలోని ఓ పాటలో శివుడిగా కాసేపు నటించి మెప్పించారు బాలకృష్ణ..!
ఢమరుకం చిత్రంలో ప్రకాష్ రాజ్ శివుడి పాత్రలో మెప్పించారు.
మావూళ్లో మహాశివుడు సినిమాలో మహాశివుడుగా మెప్పించారు నటుడు రావు గోపాల్ రావు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com