Movie Ticket Price: మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్..! టికెట్ ధరలపై కీలక నిర్ణయం..

Movie Ticket Price: సినిమా టికెట్ ధరల వివాదం కొన్నాళ్లు ఇండస్ట్రీని కుదిపేసింది. మరీ సినిమా బడ్జెట్‌కు, టికెట్ ధరలకు పొంతన లేదని.. సినీ పరిశ్రమ అంతా ఒక్కటిగా పోరాటం చేసి టికెట్ ధరల విషయంలో అనుకుంది సాధించింది. కానీ అప్పటినుండి సామాన్యుడిపై ఈ టికెట్ ధర అదనపు భారంగా మారింది. కానీ ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితి మామూలుగా మారుతున్నట్టు అనిపిస్తోంది.
సినిమా బడ్జెట్‌ను బట్టి.. దాంతో పాటు మరికొన్ని నిబంధనలను బట్టి టికెట్ ధరలను పెంచుకునే స్వేచ్ఛను మేకర్స్‌కు ఇచ్చాయి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. దీంతో పాన్ ఇండియా చిత్రాల టికెట్ రేట్లు మూవీ లవర్స్‌కు చుక్కలు చూపించాయి. అందుకే థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇష్టపడే చాలామంది టికెట్ ధరల వల్ల వెనక్కి తగ్గారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వస్తోంది.
ఇప్పటికే వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన 'ఎఫ్ 3' సినిమా రేట్లు యథావిధిగా ఉంటాయని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇది మల్టీ స్టారర్ అయినా కూడా ప్రేక్షకుల మీద అదనపు టికెట్ ధర భారం పడకూడదని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. వారి బాటలోని 'మేజర్' కూడా వెళ్తోంది. ముంబాయి దాడుల్లో ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావడంతో దీనిని ప్రజలంతా చూడాలని, అందుకే టికెట్ ధరలపై పెంపు ఉండకూడదని మూవీ టీమ్ నిర్ణయించుకుంది. ఇలా మెల్లమెల్లగా సినిమాల టికెట్ ధరలు మునుపటిలాగా మారిపోతే బాగుంటుందని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com