మా కుటుంబంలోకి మరో చిన్నారి: నమ్రత శిరోద్కర్

మా కుటుంబంలోకి మరో చిన్నారి: నమ్రత శిరోద్కర్
షైక్ రిహాన్ అనే చిన్నారికి గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయించాడు.

మహేష్ బాబు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ సూపర్ స్టారే. వైద్యం అవసరమైన చిన్నారులకు ఆసరాగా నిలుస్తాడు. ఆంధ్ర హాస్పిటల్స్ సౌజన్యంతో ఇప్పటి వరకు 1000 మందికి పైగా పిల్లల ప్రాణాలు కాపాడాడు. తాజాగా మరో చిన్నారి జీవితంలో వెలుగులు నింపాడు. షైక్ రిహాన్ అనే చిన్నారికి గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయించాడు. చిన్నారి ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసిన వైద్యులు వెంటనే ఆపరేషన్ చేసి పాప జీవితాన్ని కాపాడారు. ప్రస్తుతం పాప ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని మహేష్ బాబు

భార్య నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేశారు. మా కుటుంబలోకి మరో చిన్నారి వచ్చిందని నమ్రత పోస్ట్ పెట్టారు. కాగా మహేష్ సర్కారు వారి పాట షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆంధ్ర ఆసుపత్రుల ఆరోగ్య నిపుణులకు ఎప్పటికీ కృతజ్ఞతలు! టెట్రాలజీ ఆఫ్ ఫాలోట్ కోసం శస్త్రచికిత్స చేయించుకున్న షేక్ రిహాన్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపినందుకు సంతోషంగా ఉంది. బాబు త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నాను. బాలుడు, అతడి కుటుంబసభ్యులు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని నమ్రత పోస్ట్ పెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story