Tollywood: జేజమ్మకు పెళ్లికి ముహూర్తం ఫిక్స్! స్వీటీ జాతకంలో అదే ఉందట

Tollywood: జేజమ్మకు పెళ్లికి ముహూర్తం ఫిక్స్! స్వీటీ జాతకంలో అదే ఉందట
మన జేజమ్మ అనుష్క పెళ్లిపై వచ్చినన్ని రూమర్లు మరే ఇతర హీరోయిన్స్‌పై రాలేదు. గతంలో ప్రభాస్-స్వీటీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే తాము మంచి ఫ్రెండ్స్ అని, అలాంటివి వార్తల్లో నిజం లేదంటూ ఇద్దరూ క్లారిటీ ఇవ్వడంతో రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పడింది. తాజాగా అనుష్క పెళ్లిపై మరోసారి రూమర్స్ జోరందుకున్నాయి.
దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్తను అనుష్క పెళ్లి చేసుకోబోతుందంటూ ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో అనుష్క వివాహంపై ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ జగన్నాథ్ గురూజీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
అనుష్కకు పెళ్లి ఘడియలు దగ్గర పడ్డాయని, త్వరలోనే వివాహం జరుగుతుందని గురూజీ తెలిపారు. అంతేకాదు, స్వీటీకి మంచి గ్రహ స్థానాలు ఉన్నాయని, చంద్రుడు, బుధుడు మంచి స్థానాల్లో ఉన్నారని, దీని బట్టి చూస్తే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని కాకుండా బయటి వ్యక్తిని అనుష్క పెళ్లాడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇక స్వీటీ పెళ్లి గురించి చెబుతూ.. 2023లో ఆమెకు వివాహం ఖచ్చితంగా జరుగుతుందని, ఆమె వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుందని పండిట్ జగన్నాథ్ గురూజీ అన్నారు. మరి ఆస్ట్రో నిపుణుడు చెప్పిన వార్తల్లో నిజం ఎంత ఉందనేది తెలియాలి అంటే కాస్త వెయిట్ చెయ్యక తప్పదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com