Tollywood: మెగా జంట కన్నుల పండుగ; అదిరిన ఫ్యామిలి పిక్

Tollywood: మెగా జంట కన్నుల పండుగ; అదిరిన ఫ్యామిలి పిక్
చెర్రీ -ఉపాసన లేటెస్ట్ ట్రీట్; అందాల జంటతో పాటూ ఆ బుజ్జిది కూడా.....

Tollywood: మెగా జంట కన్నుల పండుగ; అదిరిన ఫ్యామిలి పిక్


టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే ఉపాసన, లేటెస్ట్ గా ఓ ఫోటో షేర్ చేసి మెగా ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చింది. ఆ పోస్ట్‌కి క్యాప్షన్ గా, అందరు తమ పై చూపించిన అభిమానానికి స్పెషల్ థాంక్స్ అంటూ ఇస్టా పోస్ట్ షేర్ చేసింది.


ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పిక్ లో ఇరువురూ స్టన్నింగ్ లుక్స్ తో, ట్రెండీ డ్రెస్సింగ్ స్టైల్ తో కనిపిస్తున్నారు. ముఖ్యంగా చరణ్ బ్లాక్ డ్రస్ లో రాయల్ లుక్ లో కనబడగా, ఉపాసన కలర్ ఫుల్ పూల డ్రస్ లో మెరిశారు. వీరితో పాటు తమ పెట్ కూడా ఫోటోలో దర్శనమిచ్చింది.


ఇదిలా ఉండగా ట్రోలర్స్ మాత్రం తమ నోటికి పనిచెప్పారు. ప్రెగ్నెన్సీ టైమ్ లో దిగిన మెమరబుల్ ఫోటోలో పెట్ ఎందుకు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్, ఉపాసనకు రైమ్ చాలా ప్రత్యేకం అని తెలిసిన విషయమే. చెర్రీ నిత్యం తన రైమ్ ను వెంట పెట్టుకొని షూటింగులకు కూడా వెళుతుంటాడు. ఇక నిత్యం దానితో కలిసి చేసే అల్లరి పనులకు సంబంధించిన వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటారు. సో అంత ప్రత్యేకత ఉన్న ఈ పెట్, తమ మధుర స్మృతుల్లో కూడా ఉండడంలో తప్పులేదంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story