Tollywood : లక్కీ లక్ష్మణ్ గా సోహెల్ తొలి మూవీ

లక్కీ లక్ష్మణ్ గా సోహెల్ తొలి మూవీ
ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీస్ కన్నా సస్పెన్స్ థ్రిలర్స్, క్రైమ్ స్టోరీస్ కు ఆదరణ పెరుగుతోంది. బడ్జెట్ పరంగా చిన్న సినిమాలే అయినా, మంచి కంటెంట్ తో యూత్ ను ఆకట్టుకోవటానికి ట్రై చేస్తున్నారు దర్శకులు. ఈ తరహాలో చాలామంది కొత్త హీరో హీరోయిన్లు తెలుగు తెరకి పరిచయమవుతున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా నటిస్తున్న లక్కీ లక్ష్మణ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై హరిత గోగినేని నిర్మాణంలో రూపొందిన ఈ మూవీని ఎ.ఆర్.అభి డైరెక్ట్ చేశారు. లవ్, ఫన్, ఎమోషన్స్ తో కూడిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ట్రైలర్‌లో ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా కోటీశ్వరుల కూతురును పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిలైపోతుందని భావించే యువకుడిగా సోహెల్ కనిపించాడు.
ఇక హీరోహీరోయిన్ల ఎమోషనల్ డ్రామాతో పాటు, తండ్రీకొడుకుల బంధాన్ని ట్రైలర్‌లో అద్భుతంగా చూపించారు. ట్రైలర్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ గీతూ, షానీ సాల్మన్‌తో పాటు పలువురు టాలీవుడ్ కమెడియన్స్ కనిపిస్తారు. సోహెల్ నటించిన తొలి సినిమా 'లక్కీ లక్ష్మణ్' కాగా, ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 30న థియేటర్ లో రిలీజ్ కాబోతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com