Tollywood : "కళ్యాణం కమనీయం" చిత్రం నుంచి మరో లిరికల్ సాంగ్ రిలీజ్

"కళ్యాణం కమనీయం" చిత్రం నుంచి మరో లిరికల్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ లో యువ నటుడిగా తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్నాడు సంతోష్ శోభన్. మంచి సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్న ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ 'కళ్యాణం కమనీయం'. యువి కాన్సెప్ట్స్ బ్యానర్ పై పెళ్లి నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మూవీ ద్వారా ప్రియా భవాని శంకర్ టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అవుతోంది.
రీసెంట్ గా ఈ మూవీ నుంచి 'హో ఎగిరే' అనే పల్లవితో సాగే లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా, కపిల్ కపిలన్ సాంగ్ పాడారు. ఈ మూవీలోని పాటలు యువతని ఎంతో ఆకట్టుకుంటోందని చిత్రయూనిట్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటను విన్న ఆడియెన్స్ పాటలోని సంగీత సాహిత్యాలతో ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ మూవీ పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఇక యూవీ కాన్సెప్ట్స్ నుంచి మరో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రాబోతోన్నట్లు తెలుస్తోంది. ఈ సంక్రాంతి కానుకగా 'కళ్యాణం కమనీయం' సినిమాను 2023 జనవరి 14న థియేటర్ లో రిలీజ్ చేయనున్నారు చిత్ర బృందం. ఏదేమైనా ఈ సినిమా ప్రేక్షకుల ఏవిధంగా మెప్పించనుందో తెలియాలంటే కాస్త వెయిట్ చెయ్యక తప్పదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com