Tollywood : ఇన్స్టాలో సమంత చమక్కులు; మస్త్ వైరల్ అవుతున్న పోస్ట్

Tollywood : ఇన్స్టాలో సమంత చమక్కులు; మస్త్ వైరల్ అవుతున్న పోస్ట్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ సమంత కూడా ఒకరు. తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలతో పాటు, తన వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోన్న సామ్, గతకొద్ది రోజులుగా అనారోగ్య కారణంగా విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే చాలా గ్యాప్ తర్వాత సామ్ మళ్ళీ యాక్టివ్ అయ్యింది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ కు అడ్వాన్స్ గా న్యూ ఇయర్ విషెస్ చెప్పింది.
సామ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' మీరు చేయగలిగిన వాటినే నియంత్రించండి. నూతన, సులభమైన లక్ష్యాల కోసం ఇదే సరైన సమయం. మనకు సాధ్యమయ్యే లక్ష్యాలను ముందే నిర్దేశించుకోండి. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉంటాయి. అడ్వాన్స్ హ్యపీ న్యూ ఇయర్ 2023..' అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన పలువురు ప్రముఖులు సమంతకు విషెష్ చెబుతూ రిప్లై ఇస్తున్నారు. మరికొందరు మీ ఆరోగ్యం ఎలా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు సామ్ పెట్టిన పోస్ట్ కు కేవలం మూడు గంటల్లోనే 14 లక్షలపైగా లైక్స్ కు రావడం గమనార్హం. ఇక చాలా మంది అభిమానులు హార్ట్ ఎమోజీలు పోస్ట్ చేస్తూ సామ్ ను పలకరిస్తున్నారు. మరికొందరు ఆమె త్వరలోనే తన అనారోగ్యాన్ని జయించి మళ్లీ కొత్త ప్రాజెక్ట్‌లతో తమ ముందుకు రావాలిని కోరుకుంటూ మెసేజ్ లు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com