Tollywood : ఖరారైన సమంత 'శాకుంతలం' రిలీజ్ డేట్

గత కొంత కాలంగా సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా సామ్ పూర్తిగా ఆరోగ్యం మీదే దృష్టి పెట్టాలని భావిస్తుండటంతో ఇప్పట్లో ఆమె మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసే అవకాశం లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం సమంత అభిమానులు పండగ చేసుకునే వార్త ఒకటి బయటకు వచ్చింది. సమంత, దేవ్ మోహన్ జంటగా నటించిన మూవీ 'శాకుంతలం' రిలీజ్ కు రెడీ అవ్వబోతోందట.
గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం గత ఏడాదే విడుదల కావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల ఈ మూవీ వాయిదాపడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు చిత్ర బృందం.
ఫిబ్రవరి 17న ఈ మూవీని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా 'శాకుంతలాన్ని' 3Dవెర్షన్‌లో కూడా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు అందించారు. ఇక యశోద మూవీతో హిట్ అందుకున్న సామ్ కు ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com