Tollywood: పీకల్లోతు ప్రేమలో మిల్క్ బ్యూటీ.. నానీ విలన్ తో చెట్టాపట్టాల్...

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమలో పడిందా? అంటే... అవును అనే అంటున్నారు పలువురు. హైదరాబాదీ నటుడితో మిల్క్ బ్యూటీ డేటింగ్ చేస్తోంది అనే వార్తలు సైతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. గోవాలో తమన్నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫొటోలే దీనికి కారణమంటున్నారు పలువురు.
ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్ లు ఉన్నట్టు వార్తలు పుకార్లు షికార్లు చేయడం కామన్. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ కొన్ని రూమర్స్ విన్నప్పుడు ఆ వార్తలు నిజమనే అనిపిస్తుంటాయి. రీసెంట్ గా న్యూ ఇయర్ వేడుకలను తమన్న గోవాలో సెలబ్రేషల్స్ జరుపుకుంది. ఈ వేడుకల్లో తమన్నా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ కెమెరాలకు చిక్కిందట.
MCA మూవీలో విలన్ గా నటించిన విజయ్ వర్మతో తమన్నా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని తెలుస్తోంది. న్యూ ఇయర్ వేడుకల్లో ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తున్న వీడియో లీక్ అయ్యింది. విజయ్ వర్మ వైట్ షర్ట్ వేసుకోగా, తమన్నా పింక్ డ్రెస్ లో మెరిసిపోయింది. గోవాలో జరిగిన ఓ పార్టీలో వీరిద్దరూ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు.
మరోవైపు ఇంతవరకు వీళ్ళిద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు, రీసెంట్ గా లస్ట్ స్టోరీస్ 2 సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. ఇంతలోనే అంత పరిచయం ఎలా అయ్యిందని, ఇంత క్లోజ్ గా ఎలా ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న చర్చలు జరుగుతున్నాయి.
వెబ్ సిరీస్‌లో కలిసి నటిస్తున్నపుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. ఇటీవల తమన్నా పుట్టిన రోజున ఆమె ఇంట్లో విజయ్ ప్రత్యక్షం కావడం, తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను చూస్తుంటే వీరిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ సినీ జనాలు చర్చించుకుంటున్నారు. మరి పెళ్లి వార్తలు, డేటింగ్ రూమర్స్ పై కస్సుమనే తమన్నా, ఈ వార్త పై ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com