Tollywood: నయన్ పోస్ట్ పై సమంత కౌంటర్...!
ఆడదానికి ఆడదే శత్రువు అనే నానుడిని బ్రేక్ చేస్తూ సమంత హట్ కామెంట్స్ చేసింది. లేడీ సూపర్ స్టార్ గా దూసుకుపోతున్న నయనతారకి మద్దతుగా సామ్ చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.
రీసెంట్ గా నయనతార నటించిన 'కనెక్ట్'మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నయన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసిన ఓ నెటిజన్ ఆశ్చర్యానికి గురయ్యాడు. "కనెక్ట్" సినిమా హోర్డింగ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ, ఒక హీరోయిన్ సినిమాకు ఈ స్థాయిలో హోర్డింగ్ ఏర్పాటు చేయడం చూసి చాలా ఆశ్చర్యపోయాను. పది సంవత్సరాల క్రితం హీరోయిన్లకు ఇలాంటి స్థాయి లేదని, ఇప్పుడు హీరోయిన్లు కూడా హీరోలకు దీటుగా సినిమాలు చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు.
ఈట్వీట్ పై స్పందించిన సమంత అదే విషయాన్ని రీట్వీట్ చేస్తూ, 'వుమెన్ రైజింగ్' అంటూ కామెంట్ చేసింది. నయన్ కోసం సామ్ భలే కామెంట్ చేసిందే అని అనుకునే లోగానే ట్రోలర్లు తమ మెదళ్లకు పని చెప్పారు. ఇంకేముంది నెగిటివ్ కామెంట్స్ వెల్లువ ప్రారంభమైంది. సమంత కామెంట్ కు స్పందిస్తూ ఓ వ్యక్తి 'ఏముంది మళ్లీ కిందపడేందుకే కదా' అంటూ ట్వీట్ చేయగా... దానికి సామ్ కూడా గట్టిగానే రిప్లై ఇచ్చింది. 'అవును.. పడ్డాక తిరిగి లేచే ప్రక్రియ మరింత మధురంగా ఉంటుంది మిత్రమా' అంటూ గట్టిగానే ఇచ్చిపడేసింది. దెబ్బకు ట్రోలర్స్ నోళ్లు మూతపడ్డాయనే చెప్పాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com