Tollywood: మరీ ఇంత క్యూట్ గా ఉంటే ఎలా బాస్....

తెలుగు ఇండస్ట్రీలో నందమూరి వారికంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. వారికి ఉండే అభిమానుల సంఖ్య ఎంతంటే చెప్పడం కష్టమే.. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి సక్సెస్ అయిన యువ హీరోల్లో కళ్యాణ్ రామ్ ఒకరు. కొత్త రకం సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇటీవలే 'బింబిసార'మూవీలో డ్యూయల్ రోల్ చేసిన కళ్యాణ్ కమర్షియల్ హిట్ అందుకున్నారు.
కళ్యాణ్ రామ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మిస్తోన్న సినిమా 'అమిగోస్'లో ఆయన డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు. 'అమిగోస్'అనేది స్పానిష్ పదం. స్నేహితులు అనే అర్ధం వచ్చే ఈ పదాన్ని టైటిల్ గా పెట్టారు అంటే దీని వెనుక ఏదో కథ దాగి ఉంటుందని అందరూ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారు. తాజాగా రెండు లుక్స్‌ను విడుదల చేయగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మంజునాథ్‌గా, ఎంట్రప్రెన్యూర్ సిద్ధార్థ్‌గా కళ్యాణ్‌ను చూపించారు.
త్వరలో పాటల్ని కూడా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దివంగత గేయ రచయిత వేటూరి రాసిన పాట ఈ సినిమాకు హైలైట్ కాబోతోందని మైత్రీ మూవీ మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com