Tollywood: చిరు పాటలో కంఫర్ట్ లేదంటోన్న శ్రుతి...

Tollywood: చిరు పాటలో కంఫర్ట్ లేదంటోన్న శ్రుతి...
X
శ్రీదేవి పాట చిత్రకరణ చాలా ఇబ్బందికరంగా మారిందన్న శ్రుతిహాసన్, మంచుకొండల్లో చీరకట్టతో తెగ ఇబ్బంది పడిపోయానంటోన్న బ్యూటీ

ఈ సంక్రాంతికి వెండితెరపై ప్రేక్షకులను అలరించబోతున్న మెగాస్టార్‌ మాస్‌ యాక్షన్‌ మూవీ 'వాల్తేర్‌ వీరయ్య' అన్ని పనులను పూర్తి చేసుకుంది. పాటల నుంచి ఫస్ట్‌ లుక్‌ వరకు ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. తాజాగా విడుదలైన పూనకాలు లోడింగ్‌ సాంగ్‌లో మెగాస్టార్‌తో పాటు మాస్‌ మహ రాజా రవితేజ కూడా అదరకొట్టాడు. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో తెగ సందడి చేస్తుంది.

ఈ సినిమా సెకండ్‌ ఆఫ్‌లో రవితేజ ఎంట్రీ నెక్స్ట్‌ లెవెల్‌కి తీసుకు పోతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్‌ గా శృతి హాసన్‌ నటిస్తుంది. అయితే చిరంజీవీ శ్రీదేవి పాట చిత్రీకరిస్తున్నప్పుడు తను చాలా ఇబ్బంది పడ్డానని చెబుతోంది ఈ బ్యూటీ.

ఇంతకు మ్యూటర్ ఏంటంటే...శ్రీదేవి పాటను ఐరోపాలోని చాలా అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. మూడు నిమిషాల పాటు సాగే ఈ పాట ప్రేక్షకుల మనసును దోచుకుంటుంది. కానీ ఆ పాటను గడ్డకట్టించే మంచులో చిత్రీకరించారని, అందులోనూ అంత చలిలో చీరలో డాన్స్ చేయడంలో చాలా ఇబ్బంది పడ్డానని చెబుతోంది శ్రుతి.

వాల్తేర్‌ వీరయ్యతో పాటు బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి కూడా సంక్రాంతి రోజే విడుదల కానుంది. అందులోను శృతీనే కథానాయిక అని తెలిసిందే. ఏమైనా ఈ సంక్రాంతికి అమ్మడు బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.

Tags

Next Story