Tollywood : నిర్మాతగా చిన్నారి పెళ్లికూతురు... అమ్మడికి ఊపునిచ్చిన మన్మథుడు...

అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం 'పాప్ కార్న్'.ఎం.ఎస్.చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై బోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో అవికా గోర్ నిర్మాతగా కూడా మారుతోంది. మురళి గంధం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను ఇవాళ కింగ్ నాగార్జున విడుదల చేశారు.
రొటీన్‌కు భిన్నంగా దర్శకుడు మురళి గంధం పాప్ కార్న్ మూవీని తెరకెక్కిచినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. విభిన్న వ్యక్తిత్వాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా లిఫ్ట్‌లో చిక్కుకుంటారు. ఈ సంఘటనలో వారి మధ్య ఎలాంటి ఎమోషన్స్ క్రియేట్ అయ్యాయి, లిఫ్ట్ లో ఇరుక్కున్న వారిని ఎవ్వరూ పట్టించుకోరు. మరి వారు ఆ సమస్య నుంచి ఎలా బయటపడుతారు? స్నేహితులుగా మారిన వారి జర్నీ ఎలా సాగుతుంది? అనేది థియేటర్ లో చూడాలి.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ, ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 10వ తేదీ సినిమాను విడుదల చేయబోతున్నట్లు నిర్మాత భోగేంద్ర గుప్తా తెలిపారు. మరీ ఈ మూవీ ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com