Tollywood : ఎయిర్ పోర్ట్ లో లవ్ జంట... బెరుకు లేదు కానీ, భ్రమలు తొలగించలేదు మరి...
స్టార్ హీరోయిన్ తమన్నా ఓ నటుడితో డేటింగ్ చేస్తుందన్న వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో విజయ్ వర్మను ముద్దాడుతూ దొరికిపోయిన మిల్కీ బ్యూటీ... వెకేషన్ ముగించుకుని బాయ్ ఫ్రెండ్ సహా ఇటీవలే తిరిగి వచ్చింది. కానీ, డేటింగ్ రూమర్స్ పైన మాత్రం క్లారిటీ ఇవ్వకుండానే తప్పించుకుంది.
ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్ లు ఉన్నట్టు వార్తలు షికార్లు చేయడం కామన్. కానీ ఆ వార్తలను కొందరు సెలబ్రెటీస్ లైట్ తీసుకుంటే, కొందరు మాత్రం ఆ వార్తలను కన్‌ఫ్మారమ్ చెయ్యకుండా అందరిని సస్పెన్స్ లో పెట్టేస్తుంటారు. అంటే దాని అర్థం వస్తున్న రూమర్స్ నిజమేనన్నట్లు మౌనంగా ఉంటారు. ప్రస్తుతం తమన్న విషయం కొంచెం అటూ ఇటుగా అలాగే ఉంది.
రీసెంట్ గా గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ఎంజాయ్ చేసిన తమన్నా, వెకేషన్ నుంచి తిరిగివచ్చింది. న్యూ ఇయర్ వేడుకల్లో తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో వస్తున్న రూమర్స్ పై గుర్రుమంటూ, సీరియస్ గా వెళ్ళిపోతుంది అనుకున్నారు అందరూ. కానీ మిల్క్ బ్యూటీ అందుకు భిన్నంగా విమానాశ్రయంలో పలు ఫోటో గ్రాఫర్లకు ఫోజులు ఇస్తూ, అందరికి న్యూ ఇయర్ విషస్ తెలిపింది.
ఇక వెకేషన్ అనంతరం తిరిగి వచ్చిన ఈ జంట ఎవ్వరికంటా పడకుండా, విడివిడిగా ఎయిపోర్ట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ తమన్నా రాగా, కాస్త ఆలస్యంగా విజయ్ వర్మ వచ్చాడు. ఇద్దరూ కూడా చాలా కూల్ గా కనిపించడం విశేషం. కొందరూ ఇద్దరూ మంచి స్నేహితులు సో అందుకే తమన్నా ఈ రూమర్స్‌ను లైట్ తీసుకుంది అంటున్నారు.
మరికొందరు మాత్రం నిప్పు లేనిదే పొగ రాదు, వారిద్దరి మధ్య ఏం లేనిదే వీడియో లీక్ అయ్యిందా? అంటూ డిస్కషన్స్ మొదలు పెట్టారు. ఏదేమైనా తన పై వచ్చే ప్రతీ వార్త పై కస్సుమని స్పందించే తమన్నా ఈ మ్యాటర్ లో ఎందుకు సైలెంట్ అయ్యిందన్నది తెలియాల్సి ఉంది. మరి కాస్త ఆలస్యంగానైనా మిల్క్ బ్యూటీ స్పందిస్తుందేమో చూడాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com