Tollywood : శాకుంతలం టైలర్ వచ్చేది అప్పుడేనట..

గతకొద్ది రోజులుగా మయోసైటిస్ తో బాధపడుతున్న సామ్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే.. యశోద కంటే సామ్ ముందు నటించిన చిత్రం శాకుంతలం. ఈ మూవీ గురించి లేటెస్ట్ గా వచ్చిన అప్ డేట్ కు ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన మూవీ శాకుంతలం. సమంత, దేవ్ మోహన్ జంటగా నటించిన ఈ చిత్రం నిజానికి గతయేడాదే రిలీజ్ అవ్వాల్సివుంది. కానీ 3డీ వెర్షన్ కోసం జాప్యం జరిగినట్లు గతంలో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ పలుమార్లు తెరమీదకొచ్చి ఫ్యాన్స్ ఆశలను నిరాశపరిచాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు సిద్దమైంది.
రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు యూనిట్. జనవరి 9న మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇక శాకుంతల, దుష్యంతుల కథగా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియన్ లెవల్ లో విడుదల కానుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీని, గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ భారీ స్థాయిలో నిర్మిస్తుండగా దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com