Tollywood: అవును నేను అలాంటిదాన్నే... రష్మిక

Tollywood: అవును నేను అలాంటిదాన్నే... రష్మిక
రష్మిక షాకింగ్‌ కామెంట్స్‌.. ప్రేమ ఉంటేనే.. ద్వేషిస్తారట; బహుశా నేను అలాంటి దానినే ఏమో అంటూ మెలికలు...

సెలబ్రిటీలు అన్న తర్వాత వారి గురించి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడం సహజం. అలాగే ఆ వార్తలపై నెటిజన్స్ ట్రోల్ చేయడం సర్వసాధారణం. అయితే కొందరు యాక్టర్స్‌ వీటిని చూసి చూడనట్టు వదిలేస్తారు. బట్‌ కొంతమంది మాత్రం టైం వచ్చినప్పుడు ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ ఇస్తుంటారు. ప్రస్తుతం నేషనల్‌ క్రష్ రష్మిక అదే చేసింది. కానీ ఈసారి తన పై నెగటివిటీ రాకుండా జాగ్రత పడేలా మాట్లాడిందీ ముద్దుగుమ్మ.

పుష్ప సినిమాతో ఉత్తరాదిన భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ సంపాదించుకున్న రష్మిక బాలీవుడ్‌ లో వరుస మూవీస్‌ చేస్తూ దూసుకుపోతోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్నులో నటించింది. ఈ మూవీ ఆడియో లాంచ్ కు హాజరైన రష్మిక తనపై వస్తున్న ట్రోల్స్ పై స్పందించింది.

సినిమా ఇండస్ట్రీలో చాలా నెగెటివిటీ ఉంటుందని, ఒక యాక్టర్ అయినంత మాత్రాన ప్రతి ఒక్కరూ తనను ఇష్టపడాలని రూల్‌ లేదని రష్మిక స్పందించింది. అంతేకాకుండా తాను ఓ నటి అని.. కొన్ని సందర్భాల్లో అందరికీ నచ్చకపోవచ్చని, అన్నీ సమయాల్లో అందరకి నచ్చాలి అని తాను ఆశించడం లేదని పేర్కొంది.

తనను ఇష్టపడేవారికి కూడా కొన్నిసార్లు తాను మాట్లాడే విధానం, చేతులతో చేసే సైగలు నచ్చకపోవచ్చని చెప్పుకొచ్చింది. ఏమైనా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తనను అందరూ ప్రేమగా ఆదరిస్తారని నమ్ముతున్నానని తెలిపింది. నిజానికి ప్రేమ ఉంటేనే ద్వేషం, కోపం వస్తుందని, తనని ఎంతో ప్రేమించే ప్రేక్షకులకు కొన్నిసార్లు అలా కోపం రావడం సహజం అంటూ కూల్‌ గా మాట్లాడింది. దీంతో రష్మిక తన యాటిట్యూడ్‌ తగ్గించిందని, ఈసారి ఆలోచించి మాట్లాడింది అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story