Tollywood: సమంత 'శాకుంతలం' ట్రైలర్‌ అదుర్స్‌.. వేరే లెవల్‌

Tollywood: సమంత శాకుంతలం ట్రైలర్‌ అదుర్స్‌.. వేరే లెవల్‌
మెస్మరైజ్‌ చేసిన 'శాకుంతలం' మూవీ ట్రైలర్‌; భారీ అంచనాలతో విడుదలకు రెడీ...

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ డ్రామా 'శాకుంతలం'. భారతీయ ఇతిహాసాల ఆధారంగా వస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది.

ఫిబ్రవరి 17న పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ కానున్న'శాకుంతలం' మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ ను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌. అద్భుతమైన విజువల్స్‌, అందమైన ప్రకృతితోపాటు సమంత లుక్స్‌ ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ ఈ మూవీకి ప్లస్‌ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

ప్రేమలో మోసపోయి, దుర్వాస మహర్షి ఆగ్రహానికి గురైన శకుంతల కథ చక్కగా చెప్పే ప్రయత్నం చేశాడు గుణశేఖర్‌. మొత్తానికి ఈ ట్రైలర్‌ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ట్రైలర్‌ లో మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు.

దుష్యుంతుని పాత్రలో నటించిన మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ మూవీతో పరిచయమవుతున్నాడు. చివరిలో ట్రైలర్ ఎండ్ లో సింహంపై కనిపించిన అల్లు అర్హ మరో హైలైట్ అని చెప్పాలి. మరి ట్రైలర్‌ తో మెస్మరైజ్‌ చేసిన శాకుంతలం, రిలీజ్‌ తర్వాత ఎలాంటి రిజల్ట్‌ ను అందుకుంటుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story