Tollywood:స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న బిందుమాధవి వెబ్ సిరీస్

బిగ్‌బాస్ విన్నర్ బిందుమాధవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న వెబ్‌సిరీస్ యాంగర్ టేల్స్. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ సిరీస్ త్వరలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
బిబి విన్నర్ అయిన తరువాత బిందుమాధవి చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో తరుణ్ భాస్కర్, వెంకటేష్ మహా, సుహాస్, రవీంద్ర విజయ్, ఫణి ఆచార్య, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో గృహిణిగా బిందుమాధవి కనిపిస్తుండగా, మోడ్రన్ యువతిగా మడోన్నా సెబాస్టియన్ నటిస్తోంది. సుహాస్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. నాలుగు కథల ఆంథాలజీగా ఈ సిరీస్ ను రూపొందించారు దర్శకుడు ప్రభల తిలక్.
టీజర్ చూసినట్లైయితే, రంగ, పూజ, రాధ, గిరి పాత్రలను పరిచయం చేయడంతోపాటు, అందరి ఎజెండా ఒకటే... తిరగుబాటు అంటూ టీజర్‌లో కనిపిస్తోన్న అక్షరాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. శ్రీధర్ రెడ్డి, సుహాస్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com