Tollywood: నాకు వచ్చింది నీకు రాకూడదు నాయనా....

స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య సమంత లుక్స్ పై సోషల్ మీడియాలో పెద్ద డిస్కషనే జరుగుతోంది. ఎయిర్ పోర్ట్ లో, 'శాకుంతలం' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆమె చాలా డల్ గా కనిపించింది. ఇక ఈవెంట్ లో ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు కూడా పెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఈ విషయం కాస్త పక్కన పెడితే, చాలా రోజుల తర్వాత కనిపించిన సమంత పై పలువురు హర్షం వ్యక్తం చేస్తే, మరికొందరు సామ్ లుక్స్ పై కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ చేసిన సెటైరికల్ ట్వీట్ కు సైలెంట్ గానే గట్టి రిప్లై ఇచ్చి అతని నోరు మూయించింది సామ్. ''సామ్ మీరు చాలా బక్కగా అయినట్టు, ముఖంలో కూడా కళ పోయినట్టు, చాలా డల్ గా కనిపిస్తున్నారు, నిజానికి మీ ఫేస్ లో గ్లో అండ్ చార్మ్ తగ్గింది'' అంటూ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ కు సామ్ సెటైరికల్ కౌంటర్ ఇచ్చిందనే చెప్పాలి. 'నాకు వచ్చిన అరుదైన వ్యాధి నీకు రాకూడదు అని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని , నెలలు తరబడి నేను తీసుకున్న చికిత్స నువ్వు తీసుకోకూడదని కోరుకుంటున్నా. నీ గ్లో పెరగడానికి నీ పై నేను చూపిస్తున్న ప్రేమ ఇది' అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది సామ్. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. సమంత ఇచ్చిన రిప్లైకి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com