Tollywood: పాన్ ఇండియా.... గూఢాచారి సీక్వెల్

యాక్షన్ థ్రిలర్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ అయిన అడవిశేష్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇటీవలే హిట్- 2 తో ఫుల్ జోష్ లో ఉన్న శేష్, తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేశాడు. గూఢచారితో భారీ హిట్ అందుకున్న శేష్ ఆ మూవీకి సీక్వెల్ ఉంటుందని పలుమార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆ డీటైల్స్ ను రివిల్ చేశాడు శేష్. ఇవాళ గూఢచారి సినిమాకు సీక్వెల్‌ను 'జీ2' ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన ఒక పోస్టర్ కూడా విడుదల చేశాడు. ఈ పోస్ట్ లో బిల్డింగ్ పైన శేష్ ఓ గన్ పట్టుకుని ఏదో ఛేజింగ్ యాక్షన్ లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఈ ఒక్క పోస్టర్ సినిమాపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసిందనే చెప్పాలి.
ఇక 'క్షణం' మూవీ నుంచి 'మేజర్' వరకు వరుసగా నాలుగు హిట్ లు అందుకున్న శేష్ రీసెంట్ గా 'హిట్- 2' మూవీతో సంచలనం సృష్టించాడు. దీంతో తనకున్న ఫ్యాన్ బేస్ అమాంతం పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలో 'జీ2' పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ను ఏకే ఎంటర్‌టైనమెంట్స్, పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. మరి శేష్ 'జీ2' చిత్రంతో ఎలాంటి రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com