Tollywood: సమంతకు అండగా తోడేలు...

'శాకుంతలం' ట్రైలర్ లాంచ్ కు హాజరైన సమంత పై ఓ నెటిజన్ చేసిన సెటైరికల్ ట్వీట్ కు అమ్మడు కూడా గట్టిగానే రిప్లై ఇచ్చి ట్రోలర్స్ నోరు మూయించిన సంగతి తెలిసిందే. ''సామ్ ఫేస్ లో గ్లో అండ్ చార్మ్ తగ్గింది'' అంటూ ట్వీట్ చేసిన ఓ నెటిజన్ కు సామ్ అదే రేంజ్ లో సమాధానం ఇచ్చింది.
ఈ సెటైరికల్ ట్వీట్ కు పలువురు సినీ ప్రముఖులు స్పందిచారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సామ్ కు మద్దతుగా నిలిచాడు. సదరు నెటిజన్ ట్వీట్‌కు స్పందిస్తూ 'దేనికి బాధపడాల్సిన అవసరం లేదంటూ ట్వీట్ లో రాసుకొచ్చాడు. అందం కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫిల్టర్స్ ఉన్నాయని, కానీ, ఒక్కసారి సామ్‌ను కలిస్తే, ఆమె అందమేంటో మీకే అర్ధమవుతుందంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు వరుణ్. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com