Tollywood: అతనితో క్లోజ్ గా ఐశ్వర్య.. మ్యాటర్ అదే

హీరోయిన్ ఐశ్వర్యలక్ష్మీ గతేడాది 'పొన్నియిన్ సెల్వన్-1',గాడ్సే, అమ్ము, మట్టికుస్తీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. వరుస మూవీస్ తో తన కెరీర్ లో దూసుకుపోతున్న ఈ అమ్మడు తమిళ నటుడితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అందుకు కారణంలేకపోలేదు. స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది. దీంతో వీరు పీకలోతు ప్రేమలో ఉన్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
మాస్టర్, ఖైదీ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అర్జున్ దాస్, ప్రస్తుతం తెలుగులో 'బుట్టబొమ్మ' మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు. కెరీర్ లో మంచి అవకాశాలను అందుకుంటున్న ఈ నటుడితో ఐశ్వర్య లక్ష్మి ప్రేమలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా తన సోషల్ మీడియాలో అర్జున్ దాస్‌తో కలిసి దిగిన ఓ పిక్ ను షేర్ చేసింది ఐశ్వర్య. ఈ పిక్ లో వీరిద్దరు చాలా క్లోజ్ గా ఉన్నట్లు కనిపిస్తోంది.
అంతేకాక ఆ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ హార్ట్ సింబల్ పెట్టింది ఐశ్వర్య. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా? లేక ఏదైనా మూవీ ప్రమోషన్స్ కోసం అలా పిక్ దిగారా అనేది కాస్త కన్ ఫ్యూజన్ గా మారింది. ప్రసెంట్ ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com