Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం

Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం
X
ప్రముఖ రచయిత బాలమురుగన్‌ కన్నమూత

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. తమిళ, తెలుగు భాషల్లో అనేక సినిమాలకు రచయితగా వ్యవహరించిన ప్రముఖ కళా రచయిత బాలమురుగన్‌ (86) జనవరి 15 (ఆదివారం) రోజు కన్ను మూశారు. గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం 8 గంటలకు 45 నిముషాలకు తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని ఆయన కుమారుడు భూపతి రాజా తెలిపారు. బాలమురుగన్ మృతి పట్ల తమిళ, తెలుగు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెలుగులో 'సోగ్గాడు','సావాసగాళ్లు','ధర్మదాత','ఆలుమగలు','జీవన తరంగాలు', 'బంట్రోతు భార్య'లాంటి ఎన్నో తెలుగు సూపర్‌ హిట్‌ సినిమాలకు కథలు అందించారు.

Tags

Next Story