Tollywood: పాప్‌కార్న్ సాంగ్ రిలీజ్... చైతూ హంగామా
పాప్ కార్న్ సాంగ్ ను రిలీజ్ చేసిన నాగచైతన్య; సినిమా పెద్ద హిట్ అవ్వాలంటూ అభినందనలు: ఫిబ్రవరి 10న విడుదల

అవికా గోర్, సాయి రోనక్‌లు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న 'పాప్ కార్న్' సినిమాలోని 'మది విహంగమయ్యే..' పాటను యువసామ్రాట్ నాగ చైతన్య విడుదల చేశారు. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ బృందానికి అభినందనలు తెలిపారు.
మురళి గంధం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎం.ఎస్.చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై నిర్మాత భోగేంద్ర గుప్తా, అవికా గోర్ నిర్మిస్తున్నారు. చిత్రం ఫిబ్రవరి 10న విడుదల అవుతుందని సినిమా యూనిట్ తెలిపింది. 'మది విహంగమయ్యే..' పాటకు శ్రీజో లిరిక్స్ అందించగా బెన్నీ దయాల్, రమ్యా బెహ్రా గాత్రం అందించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు.
Next Story