Tollywood: వరుణ్‌తేజ్ బర్త్ డే స్పెషల్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎప్పుడూ విభిన్నమైన కథలవైపే మొగ్గు చూపుతాడు. అలాగే ఈ సారి కూడా మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు కాంబోలో మొదటిసారిగా తెరకెక్కుతున్న వరుణ్ 12వ సినిమాకు 'గాండీవధారి అర్జున'అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
గతేడాది అక్టోబర్‌లోనే ఈ సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టారు. గురువారం వరుణ్ తేజ్ పుట్టినరోజు కావడంతో మోషన్ పోస్టర్‌ను సినిమా బృందం విడుదల చేసింది. ఇందులో మెగా ప్రిన్స్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌గా కనబడనున్నాడు. మోషన్ పోస్టర్‌ను గమనిస్తే బాంబుల మోత, గన్ ఫైరింగ్ నడుమ వరుణ్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ప్రసాద్ నిర్మిస్తుండగా మిక్కి జె.మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com