Tollywood: సినీ సత్యభామ ఇకలేరు.

Tollywood: సినీ సత్యభామ ఇకలేరు.
X
అలనాటి అందాల నటి జమున కన్నుమూత

సీనియర్‌ నటి జమున(86) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న జమున హైదరాబాద్‌లోని తన స్వగృహములో శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు.1936 ఆగష్టు 30న హంపిలో జన్మించిన జమున 1953లో పుట్టిల్లు సినిమాతో తెరంగేట్రం చేశారు. మిస్సమ్మ సినిమా జమున సినీ కెరీర్‌ను మార్చేసింది.సత్యభామ పాత్ర ఆమెకు బాగా గుర్తింపు తెచ్చింది. ఆమెను సినీ సత్యభామగా కూడా గుర్తిస్తారు. తెలుగుతో పాటు, తమిళ్‌, కన్నడ, హిందీలో కూడా జమున నటించారు. జమున మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు జమున భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్‌కు తీసుకురానున్నారు.

Tags

Next Story