Tollywood: 'శశివదనే' టైటిల్ ప్రోమో విడుదల

ల‌వ్, యాక్ష‌న్ డ్రామా ‘శశివదనే’

ర‌క్షిత్ అట్లూరి హీరోగా, కోమ‌లి ప్ర‌సాద్ హీరోయిన్‌గా ల‌వ్, యాక్ష‌న్ డ్రామాగా 'శశివదనే' రూపొందుతోంది. గోదావ‌రి నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. గౌరి నాయుడు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.వి.ఎస్.క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ ప్రై.లి, ఎ.జి.ఫిల్మ్ కంపెనీ ప‌తాకాల‌పై సాయి మోహ‌న్ ఉబ్బ‌న ద‌ర్శ‌క‌త్వంలో అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుదల కానున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. రక్షిత్ అట్లూరి, కోమ‌లి ప్రసాద్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో ప్ర‌వీణ్ యండ‌మూరి, త‌మిళ న‌టుడు శ్రీమాన్‌, క‌న్న‌డ న‌టుడు దీప‌క్ ప్రిన్స్‌, జ‌బ‌ర్ద‌స్త్ బాబీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శుక్ర‌వారం నిర్మాత అహితేజ బెల్లంకొండ 'శశివదనే' టైటిల్ ప్రోమోను విడుదల చేశారు.

హ‌రి చ‌ర‌ణ్, చిన్మ‌యి శ్రీపాద పాడిన ఈ పాట‌ను సినిమాలో తొలి పాట‌గా అల‌రించ‌నుంది. శ్ర‌వ‌ణ వాసుదేవ‌న్ సంగీతం అందించిన సంగీతం చాలా క్యూట్‌గా ఉంది. కిట్టు విస్సాప్ర‌గ‌డ సాహిత్యం ట్యూన్‌కు త‌గ్గ‌ట్లు అందంగా ఉన్నాయి. శ‌శివ‌ద‌నే పూర్తి టైటిల్ సాంగ్‌ను మేక‌ర్స్ ఫిబ్ర‌వ‌రి 1న రిలీజ్ చేయనున్నారు. ఈ వింటేజ్ మెలోడి త‌ప్ప‌కుండా ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటోంద‌ని మేక‌ర్స్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story