Tollywood: కళ్యాణ్ రామ్ 'అమిగోస్' అప్‌డేట్
ఎప్పటికప్పుడూ భిన్నపాత్రలు ఎంచుకునే నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సారి కూడా తనదైన స్టైల్‌లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై 'అమిగోస్' అనే నూతన కథతో మనముందుకు రాబోతున్నాడు. అయితే ఆ సినిమా అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులకు అందింస్తోంది సినిమా యూనిట్. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో నటిస్తుండగా ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ అభిమానుల్లో అంచనాలు పెంచేస్తొంది. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న విడుదల కానున్నది.ఈ మూవీకి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. విడుదల సమయం దెగ్గర పడుతుండగా సినిమాలోని పాటలను వరుసగా అమిగోస్ బృందం విడుదల చేస్తోంది. ఇటీవలే మెదటి పాట "యెక యెక" ను విడుదల చేయగా నేడు శుక్రవారం రెండవ పాట "ఎన్నో రాత్రులు వస్తాయని" పాట ప్రోమోను విడదల చేసింది. కాగా పూర్తి పాటను ఈ నెల29 విడుదల చేస్తున్నట్ల సినిమా యూనిట్ పేర్కొంది. కళ్యాణ్ రామ్ మూడు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా చాలా కొత్తగా ఉండబోతోందని చిత్ర బృదం చెప్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com