Tollywood: చీరకట్టులో శివాత్మిక
గ్లామర్ డోస్ పెంచిన చిన్నది

జీవితా రాజశేఖర్‌ల గారాలపట్టి శివాత్మిక ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోందని చెప్పుకోవచ్చు. తండ్రిలాగే మెడిసిన్ చదివి నటన పట్ల ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శివాత్మిక తొలుత రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌తో దొరసాని అనే సినిమాలో నటించింది. ఆ సినిమా కమర్షియల్ హిట్ అవ్వక పోయినా శివాత్మిక ఆ సినిమాకు బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డును అందుకున్నది. దొరసాని సినిమా అనంతరం ఓ తమిళ సినిమాలో కూడా ఈ చిన్నది నటించింది. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన గ్లామర్ డోస్ పెంచిందనే చెప్పాలి. ఇటీవలే మోకాళ్ల పైకి డ్రెస్ వేసి కుర్రకారులో వేడి పుట్టించిందనే చెప్పవచ్చు. తాజాగా ఎర్రంచు నల్లచీర కట్టుకొని స్లీవ్‌లెస్ జాకెట్‌లో తన అందాలను ఆరబోస్తూ దిగిన ఫోటొలు షేర్ చేసింది. ఆ ఫోటొలు కాస్త యువకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. మరి ఎందుకు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి....