Tollywood: పఠాన్ జోరు... నెమ్మదించిన శాకుంతలం

Tollywood: పఠాన్ జోరు... నెమ్మదించిన శాకుంతలం
వాయిదాపడ్డ శాకుంతల రిలీజ్ డేట్; పఠాన్ సూపర్ సక్సెసే కారణం..

బాలీవుడ్ బాద్షా దెబ్బకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ బాక్సాఫీస్ లు షేక్ అయిపోతున్నాయి. పఠాన్ కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గడంలేదు. సినిమా మంచి టాక్ సంపాదించుకోవడంతో రిలీజ్ అయ్యి వారం గడుస్తున్నా థియేటర్లు ఇంకా హౌస్ ఫుల్ గానే కొనసాగుతున్నాయి. దీంతో ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాలు విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పఠాన్ మాంచి ఊపు మీదే ఉన్నాడు. దీంతో టాలీవుడ్ కూ ఈ సెగ తగిలిందనే చెప్పాలి. అందుకే కాస్త వెనక్కి తగ్గడమే బెటర్ అని శాకుంతలం మేకర్లు ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు ఫిబ్రవరి 17న రిలీజ్ కావాల్సి ఉన్న శాకుంతలం మార్చ్ కు విడుదలను వాయిదా వేసుకుందని తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఒకేసారి సినిమాను విడుదల చేయాలని దర్శక-నిర్మాతలు ముందు నుంచీ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే హిందీ రిలీజ్ లో కొన్ని సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మార్చ్ లేదా ఏకంగా వేసవి కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సమాయత్తం అవుతోంది. ఏమైనా కాస్త లేట్ అయినా మంచి టైమ్ చూసుకుని బరిలోకి దిగడమే బెటర్ అని ఫిక్స్ అయిన సామ్... పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.


Tags

Read MoreRead Less
Next Story