Tollywood: 'తెలుసా..మనసా..' ఫస్ట్ లుక్ విడుదల చేసిన దిల్ రాజు

కేరింత ఫేమ్ పార్వతీశం ఆ సినిమాలో చేసిన నూకరాజు పాత్ర ప్రేక్షకులను ఎంతగా అలరించిందో చెప్పనక్కరలేదు. ఆ ఒక్క పాత్రతో పార్వతీశం తెలుగు ప్రేక్షకులకు చాలా దెగ్గరయ్యాడు. కేరింత తరువాత తను పెద్దగా ఏ సినిమాలో కనిపించలేదనే చెప్పాలి. మళ్లీ చాలా కాలం తరువాత "తెలుసా..మనసా.." అనే సినిమాతో హీరోగా మనముందుకు రాబోతున్నాడు. శ్రీబాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు వైభవ్ దర్శకత్వం వహిస్తుండగా వర్షా ముందాడ, మాధవి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జశ్విక హీరోయిన్‌గా పార్వతీశం సరసన మెరవనుంది, గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బుధవారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేసి సినిమా బృందానికి అభినందనలు తెలిపారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్ర బృందం పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com