Tollywood: పాప్‌కార్న్‌తో అంచనాలు పెంచేస్తున్న అవికా
అవికా గోర్, సాయి రోనక్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా పాప్‌కార్న్. ఈ సినిమా పనులు చకచకా జరుపుకుంటోంది. సినిమాకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ అంచనాలు పెంచేస్తోంది చిత్ర బృందం. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌కు య్యూట్యూబ్‌లో మంచి స్పందనే లభించింది. విడుదల చేసిన రెండురోజుల్లోనే 2.1 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. కాగా ఈ చిత్రాన్ని వాలంటైన్ వీక్‌లోనే విడుదల చేసేందుకు సినిమా బృందం రంగం సిద్ధం చేస్తోంది. ఉయ్యాల జంపాల తరువాత అవికా గోర్‌కు అనుకున్నంత హిట్ రాలేదనే చెప్పొచ్చు. ఈ సినిమా ట్రైలర్‌తో అంచనాలు అమాంతం పెంచేసింది చిన్నారి పెళ్లికూతురు. అదేకాకుండా అవికా కూడా ఈ సినిమాకు ప్రోడ్యూస్ చేసింది. ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ పతాకంపై ఎంఎస్ చలపతి రాజు సమర్పణలో వస్తున్న పాప్‌కార్న్‌కు మురళి గంధం దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రవన్ భరత్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. భోగేంద్ర గుప్త నిర్మాతగా అవికా గోర్, చలపతి రాజు సహనిర్మాతలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఫిబ్రవరి 10 న మన ముందుకు రాబోతున్న ఈ సినిమా అవికా గోర్ కు ఎలాంటి పేరు తెచ్చి పెట్టబోతోందో చూడాలి మరీ..
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com