Tollywood: విడుదలకు సిద్ధమవుతోన్న 'పర్‌ఫ్యూమ్'

Tollywood: విడుదలకు సిద్ధమవుతోన్న పర్‌ఫ్యూమ్
వేద అనే టైటిల్‌ను మార్చి 'పర్‌ఫ్యూమ్'గా పేరు

గతంలో ఎవ్వరూ చేయని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమా 'పర్‌ఫ్యూమ్'. ఈ సినిమాకు ఇంతకు ముందు 'వేద' అని టైటిల్‌ పెట్టినపప్పటికీ స్మెల్ బేస్డ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌ కావడంతో 'పర్‌ఫ్యూమ్'గా పేరు మార్చారు. అయితే చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా ఫ్రాగ్రన్స్ మ్యానిఫెస్టేషన్ పతాకంపై జే.డి. స్వామి దర్శకత్వంలో మన ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్ తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను రూపొందించామని సినిమా బృందం వెల్లడించింది. ఇటీవలే విడుదల చేసిన సినిమా టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేశాయి. అంతకుముందు ఈ పర్‌ఫ్యూమ్ చిత్ర టీజర్‌ను విడుదల చేసిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ వీడియోపై ప్రశంసలు గుప్పించారు. ఇక్కడే వీరి సక్సెస్ కన్‌ఫర్మ్‌ అయిందని చెబుతూ సినిమా స్థాయిని పెంచేశారు. మోషన్‌ పోస్టర్‌, టీజర్‌ చాలా బాగుందని అన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు సుకుమార్. ఇక చంద్రబోస్ ఈ సినిమాకు సింగిల్ కార్డ్‌గా అన్ని పాటలు రాయడం విశేషం. ఈ సినిమాకు సంగీతం అజయ్ అందిస్తున్నాడు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story