Tollywood: 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల
"కృష్ణగాడు అంటే ఒక రేంజ్" మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రయూనిట్ ప్రారంభించింది. ఈ క్రమంలో సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను శుక్రవారం డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ రిలీజ్ చేసారు . అనంతరం చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉందని ఆయన ప్రశంసించారు. ఈ సినిమాలో రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ.. హీరో హీరోయిన్ గా పరిచయమవుతున్నారు.
ఈ చిత్రాన్ని శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ మీద పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజేష్ దొండపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు సంగీతాన్ని సాబు వర్గీస్ అందిస్తున్నాడు. పాటలు, ఆర్ఆర్ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉండనున్నటు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌లోని బీజీఎం కూడా అందరినీ కట్టిపడేసేలా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com